దమ్ముంటే మా సినిమాను కూడా బాయ్ కాట్ అని ట్రెండింగ్ అయ్యేలా చేయండి అని సవాల్ విసిరారు తాప్సీ , దర్శకుడు అనురాగ్ కశ్యప్ . వాళ్ళు కోరుకున్నదే చేసారు బాలీవుడ్ ప్రేక్షకులు. గతకొంత కాలంగా బాలీవుడ్ చిత్రాలకు గడ్డు పరిస్థితులు ఎదురౌతున్నాయి. అమీర్ ఖాన్ , అక్షయ్ కుమార్ లాంటి సూపర్ స్టార్ లు నటించిన చిత్రాలకు కూడా బాయ్ కాట్ ట్రెండ్ అయ్యేలా చేసారు. దాంతో ఘోర పరాజయం పొందాయి ఆ చిత్రాలు.
వాళ్లకు మద్దతుగా నిలిచిన హృతిక్ రోషన్ పై అలాగే అర్జున్ కపూర్ పై కూడా బాయ్ కాట్ అంటూ ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. దాంతో తాప్సీ , దర్శకుడు ,నటుడు అనురాగ్ కశ్యప్ లు స్పందించారు. అమీర్ ఖాన్ , అక్షయ కుమార్ , హృతిక్ రోషన్ , అర్జున్ కపూర్ లను బాయ్ కాట్ చేయడం కాదు …… దమ్ముంటే మా సినిమాని బాయ్ కాట్ చేయండి అని సవాల్ విసిరారు. కట్ చేస్తే అదే జరిగింది.
తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ” దోబారా ”. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 19 న అంటే నిన్ననే విడుదల అయ్యింది. ఈ తాప్సీ నటించిన సినిమా అంటే కనీసపు ఓపెనింగ్స్ ఉంటాయి. కానీ బాయ్ కాట్ అనేది ట్రెండింగ్ లో ఉంది దాంతో పలు చోట్ల దోబారా షోలు క్యాన్సిల్ అయ్యాయి. మొదటి రోజున కేవలం 30 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. ఈ పరిస్థితి చూస్తుంటే తాప్సీ సినిమా కూడా ఘోర పరాజయం పొందినట్లే అని అంటున్నారు.
Breaking News