
విద్యాబాలన్ హీరోయిన్ గా మిలన్ లుత్రియా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” ద డర్టీ పిక్చర్ ”. 2011 లో విడుదలై ప్రభంజనం సృష్టించింది. సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం అప్పట్లోనే దాదాపు 120 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో జితేంద్ర కుమార్తెలు అయిన ఏక్తా కపూర్ – శోభా కపూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
విద్యాబాలన్ నటన మాత్రమే కాకుండా ఆమె గ్లామర్ ఈ సినిమాకు అదనపు హైలెట్ అయ్యింది. కథ బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ పాటలు , విద్యాబాలన్ అందాల కోసమే మళ్ళీ మళ్ళీ ఆ చిత్రాన్ని చూసిన వాళ్ళు ఉన్నారు. కట్ చేస్తే 11 సంవత్సరాల తర్వాత ఈ డర్టీ పిక్చర్ కు సీక్వెల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఏక్తా కపూర్ – శోభా కపూర్.
అయితే ఈ సీక్వెల్ లో విద్యాబాలన్ నటించకపోవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే సీక్వెల్ అని అనుకున్నారు కానీ ఇంతవరకు విద్యాబాలన్ ను సంప్రదించలేదట. ఒకవేళ వాళ్ళు అడిగితె తప్పకుండా సీక్వెల్ లో నటిస్తానని అంటోంది విద్యాబాలన్. అయితే ఇప్పుడు విద్యాబాలన్ వయసు ఎక్కువ కావడంతో పాటుగా గ్లామర్ కు పుష్కలంగా స్కోప్ ఉన్న చిత్రం కాబట్టి విద్యాబాలన్ కాకుండా మరొక హాట్ భామని తీసుకోవాలని భావిస్తున్నారట దర్శక నిర్మాతలు. గతకొంత కాలంగా బాలీవుడ్ గడ్డు రోజులను ఎదుర్కొంటోంది దాంతో డర్టీ పిక్చర్ అలాంటి వాటికి సరైన సమాధానం ఇస్తుందని భావిస్తున్నారట.