
ఐశ్వర్యరాయ్ – అభిషేక్ బచ్చన్ లు విడాకులు తీసుకోనున్నారా ? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఇటీవల కాలంలో ఐశ్వర్య – అభిషేక్ లు కలిసి కనిపించింది లేదు దాంతో ఈ ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. ఐశ్వర్య – అభిషేక్ ల మధ్య మనస్పర్థలు ఎక్కువయ్యాయని దాంతో విడాకుల దిశగా సాగుతోందని కథనం.
అమితాబ్ బచ్చన్ – జయా బచ్చన్ లు కలుగజేసుకొని మనస్పర్థలు మాయం అయ్యేలా గట్టి ప్రయత్నాలే చేశారట కానీ రాజీ కుదరలేదని తెలుస్తోంది. అందుకే ఇటీవల కాలంలో ఐశ్వర్యారాయ్ తన కూతురుతో మాత్రమే కనిపిస్తోంది. ఇటీవల జరిగిన పలు కార్యక్రమాల్లో కూడా ఐశ్వర్య సింగిల్ గానే కనిపించడం కొసమెరుపు.
49 సంవత్సరాల ఐశ్వర్యరాయ్ 2007 లో అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకుంది. ఈ ఇద్దరికీ ఆరాధ్య అనే అమ్మాయి ఉంది. 16 ఏళ్ల కాపురంలో సహజంగానే కలతలు ఉంటాయి. అయితే సర్దుకుపోయారు. కానీ ఇప్పుడు సర్దుకుపోయే పరిస్థితి కనిపించడం లేదట. ఇక ఇటీవల కాలంలో బాలీవుడ్ లో విడాకుల పర్వం యమా జోరుగా సాగుతోంది. ఆ కోవలోనే ఐశ్వర్య – అభిషేక్ ల జంట అని వినిపిస్తోంది. విడాకుల వార్తలు గట్టిగా వినిపిస్తున్నప్పటికీ అటు ఐశ్వర్య కానీ ఇటు అభిషేక్ కానీ ఖండించడం లేదు.






