సీనియర్బాలీవుడ్ నటి వీణా కపూర్ ( 74 ) కన్నకొడుకు చేతిలో హతమైంది. ఈ సంచలన సంఘటన దేశ వాణిజ్య రాజధాని ముంబైలో జరిగింది. బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన వీణా కపూర్ కు ఇద్దరు కొడుకులు కాగా ఒక కొడుకు అమెరికాలో ఉంటున్నాడు. ఇక మరో కొడుకు ముంబైలోనే ఉంటున్నాడు. అయితే 12 కోట్ల ఆస్థి విషయంలో తల్లి కొడుకుల మధ్య గొడవ జరగడంతో బేస్ బాల్ బ్యాట్ తో తలపగులగొట్టి హతమార్చాడు ఆమె కొడుకు సచిన్ .
అనంతరం తన స్నేహితుడితో కలిసి తల్లి శవాన్ని ఓ నదిలో పడేసాడు. అయితే తల్లి మరణంపై అమెరికాలో ఉంటున్న కొడుక్కి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సచిన్ ని అరెస్ట్ చేసి విచారించగా సంచలన విషయాలు బయటపెట్టాడు. కన్నతల్లి అనే కనికరం లేకుండా నిర్దాక్షిణ్యంగా హతమార్చాడు. దాంతో సచిన్ పై కేసు నమోదు చేసారు. ఈ సంఘటన మంగళవారం జరుగగా ఈరోజు వెలుగులో వచ్చింది.