
సీనియర్ నటి ఆశా పరేఖ్ ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ వరించింది. 1960 – 70 వ దశకంలో భారత్ లో తిరుగులేని స్టార్ గా వెలుగొందింది ఆశా పరేఖ్. భారత్ లో అత్యధిక పారితోషకం అందుకున్న నటిగా ఖ్యాతి గాంచింది అప్పట్లో. బాలీవుడ్ లో చెరగని ముద్ర వేసిన ఈ సీనియర్ నటికి ఇన్నాళ్లకు ప్రభుత్వ గౌరవం దక్కింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ దక్కడంతో ఆశా పరేఖ్ చాలా సంతోషంగా ఉంది.
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ దక్కడం పట్ల ఆశా కుటుంబం కూడా సంతోషాన్ని వ్యక్తం చేసింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు తగిన వ్యక్తి అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు పలువురు. ఆశా పరేఖ్ నటిగానే కాకుండా నిర్మాతగా , దర్శకురాలిగా సత్తా చాటింది. తన అభిరుచి మేరకు పలు చిత్రాలను నిర్మించింది అలాగే దర్శకత్వం కూడా వహించింది. వెటరన్ నటి ని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ కు ఎంపిక చేయడంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆశా పరేఖ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.