
దాదాసాహెబ్ అవార్డుల వేడుకలో అందాల జాతర చేసి వార్తల్లో నిలిచింది హాట్ భామ విద్యాబాలన్. తాజాగా ముంబైలో దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం అవార్డుల వేడుక జరిగింది. కాగా ఆ వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది విద్యాబాలన్. 44 సంవత్సరాల విద్యాబాలన్ అగ్ర నిర్మాత సిద్దార్థ్ రాయ్ కపూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
పెళ్లి చేసుకున్నప్పటికీ సినిమాల్లో నటించడం ఆపలేదు. అంతేగాదు అందాల ఆరబోతలో కూడా ఎక్కడా తగ్గేది లేదంటోంది. అంతేనా ……. పెళ్ళికి ముందు కంటే ఇప్పుడే ఇంకా ఎక్కువగా అందాలను ఆరబోస్తూ షాక్ ల మీద షాక్ లు ఇస్తోంది విద్యాబాలన్. తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల వేడుకలో క్లీవేజ్ షోతో మతి పోగొట్టింది ఈ హాట్ భామ.
ఏజ్ మీద పడుతున్నప్పటికీ అందాల ఆరబోతలో మాత్రం ఇంకా యంగ్ హీరోయిన్ ను అనే భ్రమలో ఉన్నట్లుంది అందుకే ఇలా అందాల జాతర చేస్తోంది. డర్టీ పిక్చర్ అనే సినిమా బాలీవుడ్ ను షేక్ చేసింది. కట్ చేస్తే 11 సంవత్సరాల తర్వాత డర్టీ పిక్చర్ కు సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. మరి ఆ సీక్వెల్ లో విద్యాబాలన్ నటిస్తుందా ? లేదా ? అన్నది చూడాలి.