
అవతార్ 2 సినిమా చూస్తూ ఏపీలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంచలన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా పెద్దాపురంలో జరిగింది. లక్ష్మారెడ్డి, శ్రీను అనే ఇద్దరు అన్నాదమ్ములు పెద్దాపురం థియేటర్లో అవతార్ 2 సినిమా చూస్తున్నారు. అయితే సినిమా చూస్తున్న సమయంలో మధ్యలోనే శ్రీను కు గుండెపోటు వచ్చింది. దాంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది.
శ్రీనును పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లుగా తెలిపారు డాక్టర్లు. సంతోషంగా సినిమా చూడాలని వెళ్లిన సమయంలో ఇలా తమ కుటుంబంలో విషాదం నెలకొనడంతో తీవ్ర దుఃఖసాగరంలో మునిగింది శ్రీను కుటుంబం. గతంలో కూడా అవతార్ సినిమా చూస్తూ తైవాన్ కు చెందిన ఓ వ్యక్తి మరణించాడు. ఇక ఇప్పుడేమో అవతార్ 2 సినిమా చూస్తూ ఏపీ కి చెందిన శ్రీను మరణించడం గమనార్హం.