
ఇళయ దళపతి విజయ్ హీరోగా నటించిన చిత్రం ” వారిసు ”. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం జనవరి 11 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. తమిళనాట మాత్రమే కాకుండా ఓవర్ సీస్ లో కూడా విజయ్ కు తిరుగులేని ఇమేజ్ ఉండటంతో భారీ ఓపెనింగ్స్ సాధించింది.
ఇక ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 300 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది వారిసు. ఇదే సినిమా తెలుగులో వారసుడుగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. తెలుగులో పెద్దగా ఆడలేదు కానీ ఫరవాలేదనిపించింది. ఇక్కడ విజయ్ కి పెద్దగా మార్కెట్ లేదు దాంతో పెద్దగా వసూళ్లు రాబట్టడం లేదు.
ఈ సినిమా 300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినప్పటికీ బయ్యర్లకు పెద్దగా లాభాలు రాలేదు ఎందుకంటే భారీ రేట్లకు ఈ సినిమాను కొన్నారు. ఈ సినిమాను నిర్మించిన దిల్ రాజు కు మాత్రం బాగానే లాభాలు వచ్చాయి ఎందుకంటే థియేట్రికల్ – నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగానే ముట్టాయి. ఇక ఈ సినిమాలో నటించిందినందుకు హీరో విజయ్ ఏకంగా 150 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. విజయ్ సరసన రష్మిక మందన్న నటించగా తమన్ సంగీతం అందించాడు. శరత్ కుమార్ , ప్రకాష్ రాజ్ , జయసుధ , శ్రీకాంత్ , కిక్ శ్యామ్ , యోగిబాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.