Deepika Delivery :ఎట్టకేలకు దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ తల్లిదండ్రులు అయ్యారు. వినాయ చవితి పండుగ మరుసటి రోజు వారింట్లో నవ్వులు విరిశాయి. బాలీవుడ్ నటి దీపికా పదుకొణె ఆదివారం (8 సెప్టెంబర్ 2024) పాపకు జన్మనిచ్చింది. లిటిల్ ఏంజెల్ రాకతో దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్‌ల కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయి. అభిమానుల్లో కూడా ఉత్సాహం కనిపిస్తోంది. గణేష్ ఉత్సవాల సమయంలో వారికి విఘ్నేశ్వరుడి ఆశీస్సులు దక్కాయి. డెలివరీకి ముందు దీపికా పదుకొణె, రణ్ వీర్ సింగ్ ముంబైలోని ప్రతిష్టాత్మక సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించారు.
దీపికా దంపతులకు శుభాకాంక్షల వెల్లువ
దీపికా పదుకొణె, రణ్‌వీర్‌సింగ్ 2018 నవంబర్ లో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లిపై బీ-టౌన్‌లో జోరుగా చర్చ జరిగింది. పెళ్లయిన 6 ఏళ్ల తర్వాత ఈ జంట సంతానం పొందారు. ఈ శుభవార్త ను వారింకిగా సోషల్ మీడియా వేదికగా పంచుకోలేదు.ఈ జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఫేక్ బంప్ అని రూమర్లు
ఈ వారం ప్రారంభంలో, దీపికా పదుకొనే తన బేబీ బంప్ ఫోటోషూట్‌ను రణవీర్ సింగ్‌తో కలిసి సోషల్ మీడియాలో పంచుకుంది. ఫేక్ ప్రెగ్రెన్సీ అని వచ్చిన రూమర్లకు ముగింపు పలికారు. బేబీ బంప్ ఫోటోషూట్ బీ టౌన్ లో చర్చనీయాంశమైంది. కొన్ని నెలల క్రితం దీపికా పదుకొణె -రణ్‌వీర్ సింగ్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు, తాము తల్లిదండ్రులు కాబోతున్నామని, సెప్టెంబర్‌లో బిడ్డ వారి ఇంటికి వస్తుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశారు. దీపికా పదుకొణె ఇటీవల ప్రభాస్ నటించిన కల్కి 2898 ADలో లీడ్ రోల్ లో కనిపించింది, ఇది 2024లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే .రోహిత్ శెట్టి దర్శకత్వంలో రాబోతునన్న సింగం ఎగైన్‌లో కూడా కనిపించనుంది. ఈ సినిమాలో ఆమె భర్త రణ్‌వీర్ కూడా ఉండటం విశేషం. ఈ మల్టీ స్టారర్ చిత్రం ఈ ఏడాది దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.