
‘జూనియర్స్ సీనియర్స్ కు చెప్పకూడదు’ ఈ డైలాగ్ గుర్తుందా.. బాగా ఫేమస్ అయిన డైలాగ్ ఇది. డైలాగ్ చెప్పిన సెకండ్ హీరోయిన్, కర్లీ హెయిర్ తో ఉన్న వ్యక్తి గుర్తుందా. ఆమే సోనియా దీప్తి. ఇది ఆమెకు ఫస్ట్ మూవీ. ఆ తర్వాత ‘వినాయకుడు’తో పాటు మరికొన్ని సినిమాల్లో కనిపించినా పెద్దగా రాణించలేదు.
శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన హ్యాపీడేస్ 2007లో విడుదలై సంచలనం సృష్టించింది. యువత ఎక్కువగా ఈ మూవీకి అట్రాక్ట్ అయ్యారు. దాదాపు సినిమాలో హీరోయిన్ తమన్నా తప్ప అందరూ కొత్తవారే. అయినా సినిమా సక్సెస్ లో ప్రధాన భూమిక పోషించారు. బ్లాక్ బస్టర్ హిట్ తో పాటు భారీ కలెక్షన్లను రాబట్టింది ఈ మూవీ. ఇందులో రాహుల్ (టైసర్) లవర్ సోనియా దీప్తి (స్రవంతి). కర్లీ హెయిర్స్ తో పాటు ఆమె గొంతు కూడా బాగా ఆకట్టుకుంది.
సోనియా దీప్తి పుట్టింది హైదరాబాద్ లోనే. డిగ్రీ పూర్తి చేసిన ఆమె ఒక ఐటీ ఆఫీస్ లో మూడేళ్లు ఉద్యోగం చేసింది. శేఖర్ కమ్ముల సోనియా దీప్తిని ఒక ప్రమోషన్ ఈవెంట్ లో చూశాడు. స్రవంతి పాత్రకు బాగా సూట్ అవుతుందని ఆమెను ఎంచుకున్నాడు. ఆ సినిమాలో ఎక్కువ మార్కులు కొట్టేసింది సోనియా దీప్తినే. మొదటి సినిమాతోనే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది. తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, తమిళంలో కొన్ని మూవీస్ లో ఆమె నటించి మెప్పించింది.
2016లో వచ్చిన ‘చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే’లో నటించిన ఆమె టాలీవుడ్ కు పూర్తిగా దూరమైన ఆమె.. 2017లో తమిళ చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత సినిమాకు పూర్తిగా దూరమైంది. తనకు పూర్తిగా అవకాశాలు తగ్గడంతో వెండితెరను విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. యూ ట్యూబ్ లో ఆమె చేసిన షార్ట్ ఫిలింస్ బాగానే గుర్తింపు సంపాదించుకున్నాయి. మళ్లీ ఆమె వెండితెరకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నవీన్ పోలిశెట్టి, అనుష్క కలిసి నటిస్తున్న ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’లో సోనియా దీప్తి కూడా ఒక పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.






