#Nani 30న్యాచురల్ స్టార్ నాని నుంచి మరో అధిరిపోయే అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. నాని ప్రస్తుతం ‘దసరా’ హిట్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా ఆయన కెరీర్ లోనే అతిపెద్ద హిట్ గా నిలిచే మూవీ. పూర్తి తెలంగాణ యాస, భాషలో వచ్చిన ఈ మూవీలో ఆయన నటనను అందరూ భేష్ అంటున్నారు. గతంలో ‘హిట్’ ఫ్రాంచైజీ కూడా తీసుకున్నారు నాని. దానికి సంబంధించి అప్ డేట్స్ రాకున్నా హిట్ 3 కూడా త్వరలోనే ముందుకు వస్తుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. హీరోగానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా నాని రాణిస్తున్నాడు.
దసరా బ్లాక్ బస్టర్ తర్వాత నాని డెబ్యూ డైరెక్టర్ శౌర్యతో తన 30వ సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. క్రిస్మస్ కానుకగా (25 డిసెంబర్, 2023)న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారని సంకేతాలు ఇస్తున్నారు. దీంతో గడువును చేరుకునేందుకు షెడ్యూళ్ల ప్రకారమే పనులు సాగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్‌నకు సంబంధించి అప్ డేట్ నాని ఓ వీడియో ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
#Nani30 ఫస్ట్ లుక్, గ్లింప్స్ ను రేపు (జూలై 13వ తేదీ)న విడుదల చేయనున్నారు. ఫీల్ గుడ్ ఎమోషన్స్ తో కూడిన ఫుల్ ఎంటర్‌టైనర్ గా ఈ చిత్రం నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తోంది. #Nani30ని ‘వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్’ పతాకంపై మోహన్ చెరుకూరి (సీవీఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తుండగా, కోటి పరుచూరి సీవోవోగా వ్యవహరిస్తున్నారు.
Ready readyyy ♥️#Nani30 pic.twitter.com/LLdd2sOA0G
— Nani (@NameisNani) July 11, 2023