Abbas తెలుగులో ఒకప్పుడు ప్రేక్షకులను తన నటనతో అందంతో కట్టి పడేసిన స్టార్ హీరోల్లో అబ్బాస్ ఒకరు.. ఈయనను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవకాశం లేదు.. ఒకప్పుడు వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అబ్బాస్ ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యాడు.
ఎంతో మందికి డ్రీమ్ బాయ్ గా భారీ క్రేజ్ సొంతం చేసుకున్నాడు.. ప్రేమదేశం సినిమాతో ఈ హీరో ఊహించని స్టార్ డమ్ అందుకుని ఎనలేని క్రేజ్ సొంతం చేసుకున్నాడు.. అయితే సడన్ గా ఈయన సినిమాల నుండి దూరం అయ్యాడు.. మళ్ళీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఇదిలా ఉండగా అబ్బాస్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్టు తెలుస్తుంది. అందుకు కారణం ఈయన 10వ తరగతిలో ఫెయిల్ అవ్వడం అట.. అంతేకాదు సరిగ్గా అదే సమయంలో ఈయన గర్ల్ ఫ్రెండ్ కూడా ఈయనను వదిలేసి పోవడంతో అబ్బాస్ ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడట.
ఒక లారీ ఎదురుగా వెళ్లి మళ్ళీ అంతలోనే తన కుటుంబం గుర్తు రావడంతో వెనక్కి వచ్చాడట.. ఇలా ఆ సమయంలోనే లవ్ ఫెయిల్యూర్ తో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు.. ఇక ఈయన ఇప్పుడు కుటుంబంతో సహా న్యూజిల్యాండ్ లో సెటిల్ అయిపోయాడు..
అయితే ఎంత క్రేజ్ వచ్చిందో అంత ఫెయిల్యూర్ కూడా చవి చూసి చేతిలో డబ్బులు లేని పరిస్థితిలోకి వెళ్లిపోయానని ఇక కొన్నాళ్ళకు నటన బోర్ కొట్టి మొత్తమే న్యూజిల్యాండ్ వెళ్ళిపోయి క్యాబ్ డ్రైవర్ గా, బైక్ మెకానిక్ గా పని చేసి కుటుంబాన్ని పోషించుకున్నట్టు ఈయన తాజా ఇంటర్వ్యూలో తెలిపారు.