
సినీ ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి, విడాకులు కామనే. సీనియర్ నటీమనులతో సహా ఈ తీరు ఇప్పటికీ ఇలాగే కొనసాగుతుండడం గమనార్హమే. సమంత-నాగ చైతన్య ప్రేమ, తర్వాత వివాహం, వెంట వెంటనే విడాకులు. ఇదే బాటలో మరో హీరోయిన్ కూడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. బాలనటిగా ఇండస్ట్రీలోకి వచ్చి, బ్లాక్ బస్టర్ మూవీస్ చేసిన ఆ హీరోయిన్ ఫ్రెండ్ ప్రియుడిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు విడాకులు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
బాలనటిగా చిత్ర సీమలోకి ప్రవేశించి టాప్ హీరోయిన్ గా ఎదిగిన వారిలో హన్సిక మోత్వాని ఒకరు. పూరీ డైరెక్షన్ లో వచ్చిన ‘దేశముదురు’తో హీరోయిన్ గా పరిచయమైంది. తర్వాత అనతి కాలంలోనే సౌత్ లో స్టార్ యాక్టర్ గా ఎదిగింది. ప్రభాస్, అల్లు అర్జు్న్, తారక్ లాంటి యంగ్ స్టార్ హీరోలతో నటించింది. ముఖ్యంగా కొలీవుడ్ లో ఆమె క్రేజ్ అంతా ఇంతా కాదు. బుట్టబొమ్మలా ఉన్న మోత్వానికి ఫాలోవర్స్ కూడా ఎక్కువే.
ఈ అమ్మడు తన స్నేహితురాలి ప్రియుడు సోహైల్ ఖతూరియాను ప్రేమించింది. అప్పట్లో దీనిపై చాలా మంది మండిపడ్డారు. ప్రాణ స్నేహితురాలి ప్రియుడిని ఎలా పెళ్లి చేసుకుంటావని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించారు. ఈ అమ్మడు మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. హన్సికా మోత్వాని ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ పిక్స్ అప్ లోడ్ చేస్తూ కుర్రకారును రెచ్చగొడుతుంది. ఆమె భర్త సోహైల్ ఇక ఇలాంటివి ఆపాలని సూచించాడు. ఈ విషయంలో వీరి మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. ఇది విడాకుల వరకూ వెళ్లనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఈ టాక్ పై హన్సిక ఏ మేరకు స్పందిస్తుందో చూడాలి.






