
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి షెడ్యూల్ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం రెండో షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే అగ్ర నిర్మాత దిల్ రాజు నైజాం హక్కుల కోసం ఏకంగా 50 కోట్ల ఆఫర్ ఇచ్చాడట. ఒక్క నైజాం లోనే 50 కోట్ల బిజినెస్ అంటే సంచలనం అనే చెప్పాలి.
ఇప్పటి వరకు నైజాంలో ఏ సినిమాకైనా 40 కోట్ల లోపే బిజినెస్ అయ్యింది. 20 నుండి 40 కోట్లుగా బిజినెస్ ఉండగా తాజాగా మహేష్ బాబు ఆ రికార్డ్ ను బద్దలు కొట్టాడు. ఈ సినిమా కోసం ఏకంగా 50 కోట్ల ఆఫర్ ఇచ్చి సంచలనం సృష్టించాడట దిల్ రాజు. ఈ విషయం ఆనోటా ఈ నోటా తెలిసి మిగతా బయ్యర్లు , డిస్ట్రిబ్యూటర్లు షాక్ అవుతున్నారట.
మహేష్ బాబు – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ఇప్పటి వరకు అతడు , ఖలేజా చిత్రాలు వచ్చాయి. అతడు ఫరవాలేదు కానీ ఖలేజా మాత్రం ప్లాప్ అయ్యింది. అయినప్పటికీ ఈ కాంబినేషన్ కు ఎనలేని క్రేజ్ ఏర్పడింది. దానికి తోడు నిజాం లో దిల్ రాజుకు పలువురు పోటీగా తయారయ్యారు. దాంతో తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి ఏకంగా 50 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.