
95 వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆస్కార్ అవార్డుల కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది. ఆస్కార్ అవార్డుల వేడుకలో ఆర్ ఆర్ ఆర్ నాటు నాటు సాంగ్ వేదిక మీద ఒక ఊపు ఊపేసింది. స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ఈ నాటు నాటు సాంగ్ ఎలా ఉంటుందో చూస్తారా ? అంటూ పరిచయ వ్యాఖ్యానం చేయడం విశేషం.
ఇక తాజాగా ఆస్కార్ అవార్డులను ప్రకటించగా అందులో కొన్ని ఆస్కార్ అవార్డులను సాధించాయి.
తాజా విషయానికి వస్తే …… ఇప్పటి వరకు ఆస్కార్ అవార్డులు సాధించిన లిస్ట్ ఇలా ఉంది.
బెస్ట్ సినిమాటోగ్రఫీ – ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్
బెస్ట్ షార్ట్ ఫిలిం – యాన్ ఐరిష్ గుడ్ బై
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ – నావల్ని
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ – జెమీలీ కర్టిస్ ( ఎవ్రిథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ )
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – కి హుయ్ క్వాన్ ( ఎవ్రిథింగ్ ఎవ్రివేర్ ఆల్ ఎట్ వన్స్ )
బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ – గిలెర్మో డెల్ టోరోస్ పినాకియో
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం – ది ఎలిఫెంట్ విష్పరర్స్ ( భారత్ నుండి ఆస్కార్ సాధించిన షార్ట్ ఫిలిం )