
అట్టహాసంగా ప్రారంభమయ్యాయి 95 వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం. ఆస్కార్ అవార్డుల కార్యక్రమం కోసం కోట్లాది మంది ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. కోట్లాదిమంది ఎదురు చూస్తున్న ఆ క్షణం రానేవచ్చింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లోగల డాల్బీ థియేటర్ లో ఈ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
ఈ వేడుకకు హీరోలు జూనియర్ ఎన్టీఆర్ , రాంచరణ్ , ఉపాసన , దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి, సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి , చంద్రబోస్ , కాలభైరవ , రాహుల్ సిప్లిగంజ్ తదితరులు ఈ వేడుకలకు హాజరయ్యారు. ఆస్కార్ బరిలో నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో పోటీ పడుతోంది. దాంతో ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి ఆస్కార్ వస్తుందనే ఆశతో ఉన్నారు కోట్లాది మంది భారతీయులు. ఆస్కార్ వేదికపై నాటు నాటు సాంగ్ ప్రదర్శనతో కింద కూర్చున్న ఆహుతులు అందరూ ఊగిపోయారంటే నాటు నాటు సాంగ్ ఎంతగా ఊపేసిందో అర్ధం చేసుకోవచ్చు.