
భారతీయులు కళలు కన్న ఆస్కార్ ఎట్టకేలకు వరించింది. బెస్ట్ షార్ట్ ఫిలిం విభాగంలో భారత్ కు ఆస్కార్ దక్కింది. ” ది ఎలిఫెంట్ విష్పరర్స్ ” షార్ట్ ఫిలింకు ఆస్కార్ వరించింది. 95వ ఆస్కార్ అవార్డులు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సౌత్ ఇండియా కపుల్ ఓ ఏనుగును దత్తత తీసుకున్న కథాంశంతో ఈ షార్ట్ ఫిలిం రూపొందింది.
కాగా ఈ షార్ట్ ఫిలిం మిగతా అన్నింటినీ వెనక్కి నెట్టి బెస్ట్ డాక్యుమెంటరీ కేటగిరీలో ఆస్కార్ సాధించడం విశేషం. దాంతో దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఆస్కార్ అవార్డు ప్రకటనతో ది ఎలిఫెంట్ విష్పరర్స్ దర్శక నిర్మాతలు , నటీనటులు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.
‘The Elephant Whisperers’ wins the Oscar for Best Documentary Short Film. Congratulations! #Oscars #Oscars95 pic.twitter.com/WeiVWd3yM6
— The Academy (@TheAcademy) March 13, 2023