ఎన్టీఆర్ , చరణ్ హీరోలుగా నటించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం మళ్ళీ విడుదల కానుంది. ఇక్కడ కాదు సుమా ! అమెరికాలో మాత్రమే ! మార్చి 3 న అమెరికాలోని 200 థియేటర్ లలో ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించింది వెరియెన్స్ ఫిలిమ్స్ . అమెరికాలో ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని ఈ సంస్థే విడుదల చేసింది. గత ఏడాది విడుదలైన ఈ చిత్రాన్ని ఇప్పుడు మళ్ళీ ఎందుకు విడుదల చేస్తున్నారో తెలుసా ? ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ మార్చి 12 న జరుగుతోంది కాబట్టి.
ఆస్కార్ బరిలో ఆర్ ఆర్ ఆర్ కూడా నిలిచిన సంగతి తెలిసిందే. నాటు నాటు అనే సాంగ్ ఆస్కార్ బరిలో నిలిచింది. ఈ పాట థియేటర్ లో దుమ్మురేపింది. ఇక ఇప్పుడేమో అవార్డు కూడా సొంతం చేసుకోవడం ఖాయమని నమ్ముతున్నారు. ఆర్ ఆర్ ఆర్ మేనియా స్టార్ట్ అయ్యింది కాబట్టి దాన్ని క్యాష్ చేసుకోవడానికి మరొకసారి 200 థియేటర్ లలో విడుదల చేస్తున్నారు.
ఎన్టీఆర్ కొమురం భీం గా నటించగా చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించిన విషయం తెలిసిందే. ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. గత ఏడాది మార్చిలో విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్ల భారీ వసూళ్లను సాధించింది. ఇప్పుడేమో ఆస్కార్ బరిలో నిలవడంతో ఆస్కార్ గెలిచే ఇండియన్ సినిమాగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆస్కార్ అవార్డుల వేడుక మార్చి 12 న జరుగనుంది దాంతో ఆరోజు తేలనుంది మన ఆర్ ఆర్ ఆర్ సినిమా పరిస్థితి ఏంటి? అన్నది.