
గుండెపోటు ఇప్పుడు ప్రధానంగా ఎక్కువ మందికి వస్తున్న జబ్బు. కారణం ఏదైనా ఇప్పుడు గుండెకు అనారోగ్య సమస్యలు సాధారణం అయిపోయాయి. దాదాపు 40 సంవత్సరాల ముందుకు గుండె జబ్బులు వస్తున్నాయంటే డాక్టర్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. మారుతున్న పరిస్థితులా లేక మరేమైనా కారణం కావచ్చు కానీ కొన్నేళ్ల క్రితం 60 సంవత్సరాలకు గుండె జబ్బులు వస్తే ఇప్పుడు 20 సంవత్సరాల నుంచే ప్రారంభమవుతున్నాయి. పోస్ట్ కరోనా సింటమ్స్ అంటూ కొన్ని వాదనలు వినిపించినా ఇప్పటి వరకూ దాన్ని ఏ శాస్త్రవేత్తలు కన్ ఫమ్ చేయలేదు.
ఇదంతా పక్కన ఉంచితే జబర్దస్త్ కమేడియన్ చలాకీ చంటికి గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. కామెడి షో మొదలైనప్పటి నుంచి ఆయన టీమ్ లీడర్ గా ఉంటూ ఎంతో మంది కమేడియన్లను తయారు చేశారు. ఆయన డైలాగ్ (పిండాకూడు) అప్పట్లో ఫేమస్. టీం లీడర్ గా ఉంటూనే జబర్దస్త్ ను ఒకటి రెండు సార్లు వీడి తర్వాత మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ఈ టీవీలోనే ‘నా షో నా ఇష్టం’లో హోస్ట్ గా చేస్తున్నారు. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోల నుంచి ఎంతో మంది కమెడియన్లు సినిమాలకు వస్తుండగా, సినిమాల నుంచి షో కు వచ్చిన వారిలో మొదటి స్థానంలో ఉండేవాడు చలాకి చంటి.
చలాకీ చంటికి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటిల్ లో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం ప్రస్తుతం సీరియస్ గానే ఉందని వైద్యులు చెప్తున్నారు. కొన్ని రోజులుగా ఆయన షోలలో కానీ, సినిమాల్లో కాని కనిపించడం లేదు. చంటి గుండెపోటుతో జవర్దస్త్ టీం తీవ్ర నిరాశకు గురైంది. చంటి త్వరగా కోలుకోవాలని వారంతా కోరుకుంటున్నారు.






