
Janhvi Kapoor అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది జాన్వీ కపూర్.. బడా నిర్మాత బోణీ కపూర్ ముద్దుల కుమార్తెగా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తన హాట్ హాట్ అందాలతో అందరిని తన వైపుకు తిప్పుకోవడంలో సఫలం అయ్యింది.. ఈమె నటన పరంగా మెప్పించడమే కాకుండా గ్లామర్ పరంగా కూడా రాణిస్తుంది..
జాన్వీ తన టాలెంట్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అయితే తెచ్చుకుంది. తల్లి లాగానే నటన పరంగా రాణించే సత్తా ఉందని నిరూపించుకుంది.. ఇక సోషల్ మీడియా లో కూడా రచ్చ రచ్చ చేస్తుంటుంది.. ఎలాంటి అందాల విందు అయిన వెనుకాడదు.. హాట్ హాట్ అందాలతో కుర్రకారుని మెప్పించే ఈ యంగ్ బ్యూటీ ఇప్పుడు పాన్ ఇండియా వ్యాప్తంగా మెప్పించడానికి సిద్ధం అవుతుంది.
ఇదిలా ఉండగా జాన్వీ సినిమాలతో మాత్రమే కాకుండా పర్సనల్ మ్యాటర్స్ తో కూడా నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది.. ఈమె చాలా సందర్భాల్లో తన ప్రియుడితో పబ్లిక్ గా దర్శనం ఇచ్చింది.. జాన్వీ ప్రజెంట్ మహారాష్ట్ర మాజీ సీఎం సునీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో ప్రేమాయణం నడుపుతూ వార్తల్లో నిలుస్తూనే ఉంది.
ఈ జంట పబ్లిక్ గా ఎన్నోసార్లు మీడియా కంట పడ్డారు. మరి తాజాగా ఈ జంట మరోసారి దొరికారు. వర్షం పడుతూ ఉండగా కూల్ వెదర్ లో ఈ జంట కారులో కనిపించారు. జాన్వీ, శిఖర్ ఇద్దరు డిన్నర్ డేట్ కు వెళ్లి వస్తున్నట్టు తెలుస్తుంది. మీడియా వీరి ఫోటోలు తీస్తుండగా జాన్వీ నవ్వులు చిందిస్తూ ప్రియుడు పక్కన కనిపించింది. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకుంటారు అనే వార్తలు బాలీవుడ్ లో ఎప్పటి నుండో వినిపిస్తున్నారు. చూడాలి ఈ జంట ప్రేమాయణం పెళ్లి వరకు వెళుతుందో లేదో..
View this post on Instagram






