మద్యానికి బానిసై కెరీర్ ని పాడు చేసుకున్న హీరోలు చలనచిత్ర రంగంలో చాలామందే ఉన్నారు. అందులో తమిళ హీరో కార్తీక్ కూడా ఒకరు. తెలుగులో ” సీతాకోకచిలుక ” అనే చిత్రంతో సంచలనం సృష్టించాడు కార్తీక్. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించాడు. అంతేకాదు డబ్బింగ్ చిత్రాలతో కూడా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. అనుబంధం , పుణ్యస్త్రీ , అభినందన , గోపాల్ రావు గారి అబ్బాయి , మగరాయుడు చిత్రాలతో పాటుగా ఘర్షణ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.
అయితే కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలో తన సహ నటి అయిన రాగిణిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు కొడుకులు. కట్ చేస్తే కొన్నాళ్ళకు రాగిణి చెల్లెలు రథిని కూడా రెండో పెళ్లి చేసుకున్నాడు. తరచుగా అక్క ఇంటికి వచ్చి పోతూ ఉండేది రథి. ఆ సమయంలో కార్తీక్ ఆమెని ముగ్గులోకి దించాడు. ఏముంది కట్ చేస్తే రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు కూడా ఒక కొడుకు.
మొత్తానికి తన ఇద్దరు భార్యలకు ముగ్గురు కొడుకులు కావడంతో సంతోషంగా ఉండాల్సింది పోయి మద్యానికి బానిసైపోయాడు. దాంతో హీరోగా అవకాశాలు తగ్గాయి. దాంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా పలు అవకాశాలు వచ్చాయి. అయితే మద్యానికి , ఇతర అలవాట్లకు బానిస కావడంతో కెరీర్ పాడైపోయింది. కార్తీక్ లాగే ఇండస్ట్రీలో చాలామంది మద్యానికి , ఇతర అలవాట్లకు బానిసై కెరీర్ ని పాడు చేసుకున్నారు.
Breaking News