
సొంత తమ్ముడే నాకు విషమిచ్చి చంపాలని చూశాడని , అయితే మెగాస్టార్ చిరంజీవి నన్ను ఆదుకున్నాడని సంచలన వ్యాఖ్యలు చేసాడు ప్రముఖ తమిళ నటుడు పొన్నాంబళం. తమిళ నటుడైన పొన్నాంబళం ఎక్కువగా విలన్ పాత్రల్లో నటించాడు. మంచి ఫైటర్ కావడంతో భారీ యాక్షన్ సినిమాల్లో తప్పనిసరిగా అతడి ఫైటింగ్ ఉండేది. రజనీకాంత్ , కమల్ హాసన్ , చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ , డాక్టర్ రాజశేఖర్ తదితర స్టార్ హీరోల చిత్రాల్లో నటించాడు.
కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో తన సవతి తల్లి సోదరుడు వస్తే ఆదరించాడట. అయితే అతడు పొన్నాంబళం ఆస్తి మీద కన్నేసి కూల్ డ్రింక్ లో విషం కలిపి ఇచ్చాడట. అయితే లక్కీ గా ప్రాణాలతోబయటపడ్డానని అంటున్నాడు. అంతేకాదు పొన్నాంబళం ఎక్కువగా మద్యం సేవించేవాడు అలాగే ధూమపానం కూడా. దాంతో మద్యం తాగడం వల్ల , సిగరెట్లు తాగడం వల్ల కిడ్నీలు పాడయ్యాయని ప్రచారం చేశారట.
అయితే తన బంధువుల్లో ఒకరు కిడ్నీ ఇవ్వడంతో ప్రాణాపాయం నుండి బయట పడ్డాడు. ప్రస్తుతం కోలుకున్నాడు …… ఆరోగ్యంగా ఉన్నాడు. అయితే తనకు ఆపరేషన్ జరగడానికి కారకుడు మెగాస్టార్ చిరంజీవి అంటూ సంచలన విషయాన్ని బయట పెట్టాడు. తన ఆపరేషన్ కు 40 లక్షల ఖర్చు అయితే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నాకు ఆపరేషన్ చేసారని అందుకు కారకుడు మెగాస్టార్ చిరంజీవి అంటూ చిరు గొప్పతనాన్ని చాటి చెబుతున్నాడు పొన్నాంబళం.