తమిళ నటుడు రాజ్ కిరణ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రియా అనే అమ్మాయి నా కూతురే కాదు. ఆ అమ్మాయిని దత్తత తీసుకొని పెంచి పెద్ద చేశాను. అయితే ఓ మోసగాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అది కూడా మమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసుకుంది. అలాంటిది నా కూతురు ఎలా అవుతుంది ? అంటూ ప్రశ్నిస్తున్నారు రాజ్ కిరణ్. అంతేకాదు ఆమెతో నాకు , నా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని కుండబద్దలు కొట్టాడు.
వివరాల్లోకి వెళితే ……. తమిళ నటుడు రాజ్ కిరణ్ కు ఒక కొడుకు. అయితే అమ్మాయి లేకపోవడంతో ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నాడు. ఆమె పేరు ప్రియ. ఆమెని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అయితే ఓ సీరియల్ నటుడితో ప్రేమలో పడింది ప్రియ. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన అతడు మోసగాడని తెలుసుకొని అలాంటి వాడు వద్దమ్మా ! మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తామని నచ్చ జెప్పారట.
అయితే ముందుగా ఒప్పుకుంది. తీరా సమయానికి బయటకు వెళ్లి వస్తానని చెప్పి పారిపోయి ఆ సీరియల్ నటుడిని పెళ్లి చేసుకుంది. అలాంటి అమ్మాయితో మాకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నాడు. అంతేకాదు మా మీద ఆరోపణలు చేయడం ఏంటి ? అని ఏకంగా ఓ పత్రికా ప్రకటన చేసాడు నటుడు రాజ్ కిరణ్. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ నటుడు బాగా సుపరిచితుడే . ముని చిత్రంలో నటించాడు. అలాగే పలు తమిళ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించాడు.