
బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ భారీ ప్రమాదానికి గురయ్యాడు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మలేషియాలో షూటింగ్ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. దాంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు విజయ్ ఆంటోనీ. అయితే ఇండియాలోనే చికిత్స తీసుకుంటే మంచిదనే ఉద్దేశంతో చెన్నై కి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
సంఘటన వివరాలలోకి వస్తే……… బిచ్చగాడు బ్లాక్ బస్టర్ కావడంతో దానికి సీక్వెల్ గా బిచ్చగాడు 2 చిత్రాన్ని చేస్తున్నారు. ఆ సినిమా ఫారిన్ లో షూటింగ్ జరుపుకుంటోంది. యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో బోట్ అదుపుతప్పి మరో బోట్ ను బలంగా ఢీ కొట్టడంతో హీరో విజయ్ ఆంటోనీ కి బలమైన గాయాలయ్యాయి. దాంతో గాయపడిన విజయ్ ఆంటోనీ ని ఆసుపత్రికి తరలించారు. అయితే విజయ్ ఆంటోనీ కి గాయాలు అయ్యాయి కానీ సీరియస్ గా లేదని , అనవసర రాద్ధాంతం చేయొద్దని హితువు పలుకుతోంది విజయ్ ఆంటోనీ భార్య.