
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంట్లో దొంగలు పడ్డారు. లాకర్ లో దాచిన విలువైన బంగారు నగలు , వజ్రాభరణాలు , నగదు మాయమయ్యాయి. ఇంట్లోని లాకర్ నుండి నగలు , నగదు మాయం కావడంతో రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ తేనాంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చెన్నై లోని ఖరీదైన ప్రాంతమైన పోయెస్ గార్డెన్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ నివాసం ఉన్న విషయం తెలిసిందే. అయితే పోయిన నగలు పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ వి. తన నగలు తండ్రి ఇంట్లోని లాకర్ లో దాచి పెట్టింది. ఈ ఆభరణాల విలువ 4 కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. నగలతో పాటుగా కొంత నగదు కూడా పోయింది.
అయితే ఇంట్లోని లాకర్ లో పెట్టిన నగలు , నగదు పోవడం అంటే ఇంట్లో పనిచేసే మనుషుల పనే అనే నిర్దారణకు వచ్చారు పోలీసులు. కొంతమంది పని మనుషులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య హీరో ధనుష్ భార్య అనే విషయం తెలిసిందే. అయితే గత ఏడాది ధనుష్ నుండి విడిపోయింది ఐశ్వర్య దాంతో తన తండ్రి ఇంట్లోనే ఉంటోంది.






