తనని లైంగికంగా వేధిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేయాలంటూ తమిళనాడు పోలీసులను ఆశ్రయించింది హీరోయిన్ అమలా పాల్. పవీందర్ సింగ్ అనే వ్యక్తితో అమలా పాల్ కు పరిచయం కావడంతో అతడితో కలిసి ఓ నిర్మాణ సంస్థని ప్రారంభించింది అమలా పాల్. అయితే ఆ బ్యానర్ పై సినిమాలను నిర్మించారు. ఆ సమయంలో పవీందర్ సింగ్ తో మరింత సాన్నిహిత్యం ఏర్పడింది. దాంతో ఆ సమయంలో పలు ఫోటోలు , వీడియోలు తీసుకున్నారట.
కట్ చేస్తే ఆర్ధిక లావాదేవీల విషయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి దాంతో పెద్ద గొడవలే జరిగాయట. ఇంకేముంది సన్నిహితంగా ఉన్న సమయంలో తీసిన ఫోటోలను , వీడియోలను ఇంటర్నెట్ లో పెడతాను అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడట. అతడి బెదిరింపులు ఎక్కువ కావడం అలాగే ఫోటోలు , వీడియోలు అతడి దగ్గర ఉండటంతో తమిళనాడు విల్లుపురం పోలీసులను ఆశ్రయించింది అమలా పాల్. పవీందర్ సింగ్ తో పాటు తనని బెదిరించిన 11 మందిపై కేసు పెట్టింది. దాంతో వాళ్ళని పట్టుకునే పనిలో పడ్డారు తమిళనాడు పోలీసులు.
దర్శకులు ఏ ఎల్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది అమలా పాల్. అయితే ఆ తర్వాత భర్త విజయ్ తో వచ్చిన విభేదాలతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత పవీందర్ సింగ్ పరిచయం అయ్యాడు. దాంతో అతడ్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. అందుకే అతడికి దగ్గరయింది. కట్ చేస్తే కొన్నాళ్లకే అతడితో విబేధాలు తలెత్తాయి ……. దాంతో పెళ్లి చేసుకోలేదు. ఇలా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది పాపం.