హీరోయిన్ అమలాపాల్ కెరీర్ ప్రారంభంలో పద్దతిగా నటించినప్పటికీ విడాకులు తీసుకున్న తర్వాత మాత్రం వీర లెవల్లో రెచ్చిపోతూ బోల్డ్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. బోల్డ్ గా నటించడం వల్ల రకరకాల పాత్రలను పోషించే అవకాశం ఉంటుంది అంతేకాని తెలుగు సినిమాల్లోని హీరోయిన్ మాదిరిగా నటిస్తే అందులో గొప్పేముంది అంటూ సంచలన కామెంట్స్ చేసింది.
తెలుగులోనే ఈ భామ మొదటగా నటించింది. అయితే ఒకటి రెండు సినిమాలు చేయగానే ఈ భామకు అర్థమైపోయిందట……. తెలుగులో నటించడం వల్ల పెద్దగా కిక్ లేదని . దాంతో తమిళ సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చింది. అక్కడ ఈ భామ విభిన్న కథా చిత్రాలు చేసింది. విభిన్న కథా చిత్రాలు అనేకంటే బోల్డ్ చిత్రాలు చేసింది అని చెప్పడం సబబు. బోల్డ్ చిత్రాలు చేయాలంటే ధైర్యం కావాలి అలాగే మనలోని టాలెంట్ బయటకు వస్తుందని అంటోంది అమలాపాల్.
ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఈ భామ వైవాహిక జీవితం మాత్రం వివాదాల చుట్టూనే తిరుగుతోంది పాపం. మొదటి భర్త దర్శకులు ఎల్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత మూడేళ్లు కూడా కాపురం చేయకుండానే విడాకులు తీసుకుంది. ఇక ఆ వెంటనే భవీందర్ సింగ్ ని రహస్యంగా పెళ్లి చేసుకుంది. ఇక ఈ కాపురం కూడా నాలుగేళ్లకే బెడిసి కొట్టింది.