
హాట్ భామ అమలాపాల్ మాల్దీవులలో రచ్చ రచ్చ చేస్తోంది. ఉన్నది ఒకటే జిందగీ ……. ఫుల్లుగా ఎంజాయ్ చేయడానికే అన్నట్లుగా వ్యవహరిస్తోంది. మాల్దీవులలో ల్యాండైన ఈ భామ చిట్టి పొట్టి బట్టలతో ఫోటోలకు రకరకాల భంగిమల్లో ఫోజులు ఇచ్చింది. అంతేనా ఆ ఫోటోలను ట్విట్టర్ , ఇన్ స్టాగ్రామ్ లలో పోస్ట్ చేసి మరింత వేడి రాజేసింది.
అమలాపాల్ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. రెండేళ్ల కాపురంలో మనస్పర్థలు రావడంతో 2017 లో విడాకులు తీసుకుంది. ఆ వెంటనే భవీందర్ సింగ్ ని రహస్యంగా రెండో పెళ్లి చేసుకుంది. కానీ ఈ పెళ్లి విషయాన్ని ఎక్కడా బయటకు తెలియకుండా జాగ్రత్తపడింది. అయితే తరచుగా అతడితో తిరుగుతుంటే మీడియాకు అనుమానం వచ్చి అతడితో మళ్ళీ పెళ్లి అయినట్లు కథనాలు వెలువడటంతో అబ్బే ! అతడు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని సర్దిచెప్పుకుంది.
కట్ చేస్తే ఇటీవల భవీందర్ సింగ్ ని పోలీసులతో అరెస్ట్ చేయించడంతో అతడు జరిగినవన్నీ బయట పెట్టేసాడు …… పెళ్లి అయినట్లుగా. దాంతో ఖంగుతిన్నారు సినిమా వర్గాలు. అయితే ఇక్కడ ఇంత గోలగా ఉన్నప్పటికీ ఈ భామ మాత్రం ఎలాంటి వాటిని లెక్కచేయకుండా మాల్దీవులకు చెక్కేసింది. అక్కడ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది.