తమిళ స్టార్ హీరో తెలుగులో నటించిన చిత్రం సార్. ఫిబ్రవరి 17 న విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 8 రోజుల్లో 75 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. తెలుగు , తమిళంలో విడుదలైన ఈ చిత్రం రెండు చోట్లా మంచి వసూళ్లను సాధిస్తోంది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా సముద్రఖని , సాయి కుమార్ , సుమంత్ , హైపర్ ఆది , తనికెళ్ళ భరణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందించాడు. ఇక దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి కష్టపడ్డాడు. మొత్తానికి మంచి రిజల్ట్ వచ్చింది. ధనుష్ తన మార్కెట్ ను మరింతగా పెంచుకునే క్రమంలో చేసిన ఈ సినిమా మంచి విజయం సాధించి తాను అనుకున్న మార్క్ ను సెట్ చేసింది.
సార్ విజయంతో ఇక నుండి ధనుష్ నటించే ప్రతీ సినిమా తెలుగులో కూడా విడుదల అవ్వడం ఖాయం. 22 సంవత్సరాల క్రితం చదువులు ఎలా ఉన్నాయి ….. ఎలాంటి మార్పు వస్తే బాగుంటుంది అనే సందేశాత్మక చిత్రంగా వచ్చిన సార్ కు ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. 75 కోట్ల మార్క్ ను అందుకున్న ఈ చిత్రం ఇంకా స్టడీగానే ఉంది. దాంతో మరిన్ని వసూళ్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది.