దర్శకులు గుణశేఖర్ పెద్ద కూతురు పెళ్లి ఈరోజు హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరుగనుంది. యువ వ్యాపారవేత్త అయిన రవి ప్రఖ్యా తో గుణశేఖర్ కూతురు నీలిమ పెళ్లి జరుగనుంది. ఇటీవలే హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో వివాహ నిశ్చితార్థం జరిగింది. ఆ వివాహ నిశ్చితార్ధ వేడుకకు మాజీ మంత్రి కొండా సురేఖ హాజరు కావడం విశేషం.
గుణశేఖర్ నిర్మించిన పలు చిత్రాలకు నీలిమ తనవంతు బాధ్యతలను నిర్వర్తించింది. అలాగే అనుష్క – అల్లు అర్జున్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ” రుద్రమదేవి ” చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించింది. ఇక ఇప్పుడేమో సమంత హీరోయిన్ గా నటించిన ” శాకుంతలం ” చిత్రానికి నిర్మాతగా వ్యవహరించింది నీలిమ. ఈరోజు ( డిసెంబర్ 2 న ) జరిగే పెళ్లి వేడుకకు పెద్ద ఎత్తున సినీ , రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. నీలిమ – రవి ప్రఖ్యా లను ఆశీర్వదించనున్నారు.