
దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” సీతారామం ”. ఆగస్టు 5 న విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పటి వరకు దర్శకుడు హను రాఘవపూడి పలు చిత్రాలకు దర్శకత్వం వహించాడు కానీ కమర్షియల్ బ్లాక్ బస్టర్ ని మాత్రం అందుకోలేకపోయాడు. ఆ లోటు సీతారామం చిత్రంతో తీరింది.
హను రాఘవపూడి ప్లాప్ డైరెక్టర్ కావడంతో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేకుండాపోయాయి. కట్ చేస్తే రోజు రోజుకు ప్రజాధారణ పెరిగి పెద్ద విజయాన్ని అందుకుంది. తెలుగు , తమిళ , మలయాళ భాషల్లో మంచి హిట్ కావడంతో హిందీలో కూడా విడుదల చేసారు. ఇక హిందీలో కూడా మంచి విజయాన్నే సాధించింది.
దాంతో సీతారామం చిత్రానికి సీక్వెల్ ఉంటుందా ? అని హీరో దుల్కర్ సల్మాన్ ని ప్రశ్నించడంతో లేదు మొహమాటం లేకుండా చెప్పాడు. సీతారామం ఓ క్లాసిక్ . క్లాసిక్ చిత్రాలను పదేపదే టచ్ చేయొద్దు. అందుకే దానికి సీక్వెల్ ఉండకపోవచ్చు. అలాగే రీమేక్ కూడా సాధ్యం కాదు. సీతారామం లాంటి క్లాసికల్ చిత్రాలను మళ్ళీ మళ్ళీ టచ్ చేయలేము అంటూ చెప్పుకొచ్చాడు. సీతారామం చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ – స్వప్న సంయుక్తంగా నిర్మించిన విషయం తెలిసిందే.