
ఇళయదళపతి విజయ్ కొత్త సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు చెన్నై లో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హీరో విజయ్ , హీరోయిన్ త్రిష , ప్రియా ఆనంద్ , సీనియర్ హీరో అర్జున్ తదితరులు హాజరయ్యారు. విజయ్ కు ఇది 67 వ సినిమా కావడం విశేషం. ఇక ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకుడు కావడం విశేషం.
బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోంది. దాంతో పలు భాషలకు చెందిన నటీనటులను ఎంపిక చేశారు. ఇక ఈ సినిమా కోసం విజయ్ ఏకంగా 150 కోట్ల రెమ్యునరేషన్ అందుకోవడం విశేషం.