సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు ఈరోజు. దాంతో ప్రపంచ వ్యాప్తంగా రజనీకాంత్ అభిమానులు పలు ఆసుపత్రులలో పాలు , పండ్లు , బ్రెడ్ లను పంచుతూ తమ అభిమాన హీరో పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా పలు థియేటర్ లలో రజనీకాంత్ సినిమాలను కూడా ప్రదర్శిస్తున్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ మేనియా ఒక్క తమిళనాడుకు మాత్రమే పరిమితం కాదు సుమా ! మన తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేనా ……. హిందీలో అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా అంటే అతిశయోక్తి కాదు సుమా ! రజనీకాంత్ కు ఎల్లలు లేని అభిమానం ఆయన సొంతం. ఇదంతా ఎందుకంటే …….. హహహ్హా …….. స్టైల్ కు పెట్టింది పేరు రజనీకాంత్.
డిసెంబర్ 12 రజనీ పుట్టినరోజు కావడంతో అదొక పండగలా చేసుకుంటారు అభిమానులు. ఇక రజనీకాంత్ భార్య లత కూడా ఒక అభిమాని అనే చెప్పాలి. రజనీకాంత్ ను చూడటానికి వచ్చిన లతను చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయాడు. దాంతో మొదటి సమావేశంలోనే ప్రేమిస్తున్నట్లుగా , పెళ్లి చేసుకుంటాను అన్నట్లుగా చెప్పడంతో లత షాక్ అయ్యిందట. తేరుకున్న తర్వాత మా పేరెంట్స్ ను అడగండి అంటూ వెళ్లిపోయిందట.
ఇంకేముంది ఆమె ప్రేమను సొంతం చేసుకోవడానికి రజనీకాంత్ చాలా కష్టాలే పడ్డాడు. చివరకు కొన్ని రోజుల పాటు డిప్రెషన్ కు కూడా లోనయ్యాడట. లతకు అలాగే లత పేరెంట్స్ కు రజనీకాంత్ అంటే ఇష్టమే కానీ రజనీకాంత్ ను కొన్నాళ్ళు దూరంగా పెడితే ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలని చేశారట. కట్ చేస్తే రజనీకాంత్ లత లేకుండా బ్రతకలేడని నిర్దారించుకున్న తర్వాత సడెన్ గా రజనీకాంత్ కు కనిపించి పిచ్చ షాక్ ఇచ్చారట.
దాంతో తాను కోరుకున్న భామ తన ప్రేమను అంగీకరించి ఎదురుగా నిలవడంతో ఉబ్బి తబ్బిబ్బై పోయాడట. ఇంకేముంది పెద్దల ఆశీర్వాదంతో 1981 ఫిబ్రవరి 26 న తిరుపతిలో పెళ్లి చేసుకున్నాడు. ఆ ఇద్దరికీ ఇద్దరు కూతుర్లు అనే విషయం తెలిసిందే. మొత్తానికి ….. ఇదీ రజనీకాంత్ లవ్ స్టోరీ. ఇక 72 సంవత్సరాలు పూర్తి చేసుకొని 73 వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు రజనీకాంత్. ఈ వయసులో కూడా తనదైన స్టైల్ తో ఆకట్టుకుంటున్నాడు. ఈరోజు సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని JSWtv & Jaiswaraajya.tv జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తోంది.