అందాల భామ త్రిష ఒంటి మీదకు 40 ఏళ్ళు వచ్చాయి. అయినా ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి మీదకు గాలి మళ్లింది ఈ భామకు దాంతో టాలీవుడ్ హీరో ని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. అయితే ప్రేమకు ఒకే కానీ పెళ్ళికి నో అని చెప్పడంతో బ్రేకప్ అయ్యింది. దాంతో రానా – త్రిష విడిపోయారు. అవును అప్పట్లో రానా – త్రిష పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. కానీ విడిపోయారు.
ఆ తర్వాత వరుణ్ మణియన్ అనే నిర్మాతని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఎంగేజ్ మెంట్ కూడా అయ్యింది. సరదాగా విదేశాలు చుట్టొచ్చారు. ప్రత్యేక విమానంలో ఫుల్లుగా ఎంజాయ్ చేసారు. కానీ విదేశాలను చుట్టేసి వచ్చాక ఎక్కడో తేడాకొట్టింది. అంతే ఎంగేజ్ మెంట్ రద్దు చేసుకున్నారు. కొన్నాళ్ళు సైలెంట్ గా ఉంది త్రిష.
కట్ చేస్తే ఇటీవలే మరొకరితో లవ్ లో పడటం , ఫెయిల్ అవ్వడం కూడా జరిగిందట. దాంతో పిచ్చ కోపంలో ఉందట త్రిష. తాజాగా తన మాజీ లవర్ ని ఉద్దేశించి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. త్రిష తెలుగు , తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. నెంబర్ వన్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది కూడా. కట్ చేస్తే ఇప్పుడు చేతిలో పెద్దగా సినిమాలు లేవు.
Breaking News