
తమిళ స్టార్ హీరో అజిత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అజిత్ తండ్రి సుబ్రమణ్యం అనారోగ్యంతో మరణించారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుబ్రమణ్యం ఈరోజు ఉదయం తెల్లవారుఝామున తుదిశ్వాస విడిచారు. తండ్రి మరణంతో అజిత్ తీవ్ర దుఃఖసాగరంలో మునిగారు.
అజిత్ తండ్రి మరణించారనే విషయం తెలుసుకున్న పలువురు హీరోలు , సాంకేతిక నిపుణులు అజిత్ కు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఈరోజు సాయంత్రం చెన్నై లోని బీసెంట్ నగర్ లోని శ్మశానవాటికలో తండ్రి అంత్యక్రియలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పలువురు దర్శక నిర్మాతలు , నటీనటులు , అభిమానులు అజిత్ ఇంటికి వచ్చి సుబ్రమణ్యం కు నివాళులు అర్పిస్తున్నారు.