తమిళ స్టార్ హీరో సూర్య తన కుటుంబంతో విడిపోయాడని పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హీరో సూర్య తన తల్లిదండ్రులు అలాగే సోదరుడు కార్తీ కుటుంబంతో కలిసి చెన్నై లో ఒకే ఇంట్లో ఉండేవాడు. అయితే గతకొంత కాలంగా సూర్య కుటుంబంలో తీవ్ర కలహాలు చెలరేగాయట. దాంతో నిత్యం గొడవలు పడుతూ ఒకే ఇంట్లో ఉండటం కంటే వేరు వేరుగా ఉండటం బెటర్ అని ఫిక్స్ అయ్యాడట అందుకే చెన్నై లోని ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయాడట సూర్య.
చెన్నై లో ఉండటం కంటే కాస్త దూరంగా ఉంటే బెటర్ అని భావించాడట హీరో సూర్య అందుకే ముంబైలో ఉంటున్నాడట సూర్య. మమతలకోవెల లాంటి సూర్య కుటుంబం ఇలా విడిపోవడానికి కారకులు ఎవరో తెలుసా …… జ్యోతిక . అవును జ్యోతిక కారణమని సూర్య సన్నిహితులు పేర్కొంటున్నారు. జ్యోతిక ఒత్తిడి వల్ల తరచుగా తండ్రితో గొడవలు పడటం కంటే దూరంగా ఉంటేనే మంచిదని జ్యోతిక సలహా మేరకు ముంబైకి మకాం మార్చాడట.
హీరో సూర్య హీరోయిన్ జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లి విషయంలో మాత్రం సూర్య తండ్రి నటుడు అయిన శివకుమార్ అభ్యంతరం చెప్పాడట. అయితే సూర్య ఒత్తిడి చేయడంతో పెళ్ళికి ఒప్పుకున్నాడు. కట్ చేస్తే పెళ్లి అయ్యాక జ్యోతిక సినిమాలలో నటించడం మానేసింది. కొన్నాళ్ల తర్వాత మళ్ళీ సినిమాల్లో నటిస్తోంది. జ్యోతిక మళ్ళీ సినిమాల్లో నటించడం సూర్య తండ్రి శివకుమార్ కు ఇష్టం లేదట.
దాంతో తరచుగా వాగ్వాదాలు జరుగుతున్నాయట. అంతేకాకుండా పెద్ద ఇల్లు అయినప్పటికీ అందరితో కలిసి ఆ ఇంట్లో ఉండటం కుదరదు అని తరచుగా జ్యోతిక వాదించిందట. దాంతో ఈ గొడవలు ఇలాగే జరుగుతుంటాయి కాబట్టి దూరంగా ఉంటేనే ప్రేమలు ఉంటాయని భావించి ముంబైకి షిఫ్ట్ అయినట్లుగా తెలుస్తోంది.