
ఇళయ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న ద్విభాషా చిత్రం ” వారిసు ”. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగులో ” వారసుడు ” గా రానుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తోంది. తమిళనాట విజయ్ స్టార్ హీరో అనే విషయం తెలిసిందే. ఊర మాస్ ఇమేజ్ ఉన్న నటుడు విజయ్ దాంతో తమిళనాట మొదటి రోజు అలాగే మొదటి వారంలో రికార్డుల మోత మోగడం ఖాయంగా కనిపిస్తోంది.
2023 జనవరి 12 న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు దిల్ రాజు. దాంతో డిసెంబర్ 24 న ఈ చిత్ర ఆడియో వేడుకను అంగరంగ వైభవంగా చెన్నై మహానగరంలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాడు దిల్ రాజు. ఇక అక్కడకే తెలుగు మీడియాను కూడా తీసుకెళ్తున్నారు.
విజయ్ , రష్మిక మందన్న తదితరులు ఈ వేడుకలో పాల్గొననున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే తమన్ అందించిన పాటలలో రెండు పాటలు యూట్యూబ్ లో దుమ్ము దుమారం రేపాయి. రికార్డుల మోతలు మోగుతున్నాయి. తెలుగులో కూడా ఈ సినిమా భారీగానే విడుదల కానుంది. ఇక ఇదే రోజున బాలయ్య నటించిన వీర సింహా రెడ్డి చిత్రం కూడా విడుదల అవుతోంది దాంతో రెండు సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొనడం ఖాయం.