
ఇళయ దళపతి విజయ్ తాజాగా నటిస్తున్న చిత్రం ” లియో ”. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవలే సెట్స్ మీదకు వెళ్ళింది. అలా షూటింగ్ స్టార్ట్ అయ్యిందో లేదో ఇలా బిజినెస్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం విజయ్ కున్న మాస్ ఫాలోయింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే యావరేజ్ టాక్ ఉన్న చిత్రాలు సైతం వసూళ్ల వర్షం కురుస్తాయి. ఇటీవలే విజయ్ నటించిన వారిసు తెలుగులో వారసుడుగా విడుదలైన విషయం తెలిసిందే.
ఆ చిత్రానికి యావరేజ్ టాక్ అనే వచ్చింది. అయితే ఈ సినిమా ఏకంగా 320 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇంతటి భారీ వసూళ్లు రావడానికి కారణం విజయ్ కున్న క్రేజ్. ఆ క్రేజ్ వల్లే విజయ్ లియో చిత్రానికి ఏకంగా 400 కోట్ల బిజినెస్ జరిగిందట. థియేట్రికల్ – నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో మొత్తంగా 400 కోట్ల బిజినెస్ జరిగిందట. దాంతో ఇది సంచలనంగా మారింది.
లోకేష్ కనగరాజ్ హీరోలను ఎలా చూపిస్తే అభిమానులు వసూళ్ల వర్షం కురిపిస్తారో బాగా కనిపెట్టాడు. మాస్ పల్స్ బాగా పట్టినవాడు కావడంతో కమల్ హాసన్ నటించిన విక్రమ్ వసూళ్ల వర్షం కురిపించింది. విక్రమ్ తర్వాత వెంటనే విజయ్ తో సినిమా చేస్తుండటంతో ఈ సినిమా హక్కుల కోసం గట్టి పోటీ ఏర్పడింది. విజయ్ సరసన త్రిష కథానాయికగా నటిస్తుండగా కీలక పాత్రల్లో పలువురు స్టార్స్ నటిస్తున్నారు.