
ఇళయ దళపతి విజయ్ తాజా చిత్రం ” వరిసు ”. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో వారసుడు గా రిలీజ్ చేస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు – శిరీష్ , పరమ్. వి. పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతికి విడుదల చేయనున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి ” రంజితమే ” అనే పాట విడుదల కాగా ఆ పాట ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది.
విజయ్ సాంగ్ అంటే చాలు అది మాములుగా ఉన్నా కూడా యూట్యూబ్ లో ట్రెండ్ క్రియేట్ చేయడం కామన్ అయిపోయింది. విజయ్ కు తమిళనాట ఎనలేని క్రేజ్ ఉన్న విషయం విదితమే ! ఈ సినిమా కోసం ఏకంగా 100 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నాడు ఇళయ దళపతి విజయ్. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున బిజినెస్ కూడా జరిగింది ఈ చిత్రానికి.
పక్కా మాస్ మసాలా చిత్రంగా రూపొందినట్లు తెలుస్తోంది. సంక్రాంతి బరిలో విజయ్ సినిమా దిగుతుండటంతో తెలుగు సినిమాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలనే రాద్ధాంతం జరుగుతోంది. అయితే దిల్ రాజు మాత్రం ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు ఏకకాలంలో విడుదలైనా సరే థియేటర్లను సర్దుబాటు చేసేంత అవకాశం ఏపీ , తెలంగాణలో ఉందని …… అది పెద్ద సమస్య కాదని అంటున్నాడు. గతంలో కూడా సంక్రాంతి కి స్టార్ హీరోల చిత్రాలు 3 లేక 4 కూడా విడుదలైన సందర్భాలు అనేకం.