
కాంతార హీరో , దర్శకుడు రిషబ్ శెట్టి కి సూపర్ స్టార్ రజనీకాంత్ గోల్డెన్ చైన్ , లాకెట్ బహుమతిగా ఇచ్చినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల రిషబ్ శెట్టిని తమిళనాడుకు పిలిపించుకున్న సంగతి తెలిసిందే. కాంతార చిత్రాన్ని చూసిన రజనీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. దాంతో ఆ దర్శకుడు , హీరో రిషబ్ శెట్టిని చెన్నైకి పిలిపించుకున్నారు. అంతేకాదు ఇంటికి వచ్చిన రిషబ్ శెట్టి కి గోల్డ్ చైన్ తో పాటుగా లాకెట్ కూడా బహుమతిగా ఇచ్చాడట.
కన్నడ చిత్రమైన కాంతార కర్ణాటకలో సంచలన విజయం సాధించింది. దాంతో ఆ సినిమాని తెలుగులో , హిందీలో కూడా విడుదల చేయగా అక్కడ కూడా సంచలన విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా 350 కోట్ల వసూళ్లను సాధించింది కాంతార . ఈ సినిమా ప్రభంజనం సృష్టించడంతో రిషబ్ శెట్టి ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయాడు.