
స్టార్ హీరో కన్నడ ప్రభాకర్ నన్ను మోసం చేశాడంటూ సంచలన ఆరోపణలు చేసింది నటి అంజు. బాలనటిగా పలు చిత్రాల్లో నటించింది అంజు. ఆ తర్వాత పలు చిత్రాల్లో సహాయక పాత్రల్లో నటించింది. అయితే అంతకంటే ఎక్కువగా వ్యాంప్ పాత్రలను పోషించి బాగా పాపులర్ అయ్యింది ఈ భామ. తెలుగు , తమిళ , మలయాళ , కన్నడ చిత్రాల్లో నటించింది.
అప్పట్లో కన్నడంలో స్టార్ హీరో కన్నడ ప్రభాకర్. హీరోగా నటిస్తూనే విలన్ గా కూడా నటించాడు. ఇక మన తెలుగులో అలాగే తమిళ్ లో విలన్ గా నటించాడు. 80 – 90 వ దశకంలో తెలుగునాట తిరుగులేని విలన్ కన్నడ ప్రభాకర్ అనే చెప్పాలి. అయితే ఓ కన్నడ చిత్రంలో నటించే నిమిత్తం అంజు వెళ్ళినప్పుడు ఆమెను చూసి ప్రేమలో పడిపోయాడట కన్నడ ప్రభాకర్.
దాంతో డైరెక్ట్ గా పెళ్లి చేసుకుంటాను అని ప్రపోజల్ పెట్టాడట. అప్పటికే కన్నడ ప్రభాకర్ కు మూడు పెళ్లిళ్లు అయ్యాయి….. పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆ విషయాన్ని దాచి అంజును పెళ్లి చేసుకున్నాడు. అయితే అంజు తల్లిదండ్రులు మాత్రం అతడితో పెళ్లి వద్దని వారించారట. కానీ అంజు మాత్రం వాళ్ళ మాటలు వినిపించుకోలేదు. 50 ఏళ్ల ప్రభాకర్ ను పెళ్లి చేసుకుంది.
ఇక అప్పుడు అంజు వయసు ఎంతో తెలుసా …… కేవలం 17 సంవత్సరాలు మాత్రమే . అయితే పెళ్లి చేసుకొని ఇంటికి వెళ్లిన కొద్ది రోజుల్లోనే అతడి నిజస్వరూపం తెలిసిందట. దాంతో నన్ను మోసం చేసావ్ …… ఇక నువ్ చచ్చినా చూడను అంటూ వచ్చేసిందట. అంతేకాదు కన్నడ ప్రభాకర్ చనిపోయిన విషయం తెలిసి కూడా వెళ్లలేదని అంటోంది అంజు. ప్రస్తుతం సీరియల్ లలో నటిస్తోంది అంజు. కన్నడ ప్రభాకర్ ను పెళ్లి చేసుకొని జీవితంలో పెద్ద తప్పు చేశాను అని కుమిలిపోతోంది.