
పొన్నియన్ సెల్వన్ – 2 చిత్రాన్ని ఏప్రిల్ 28 న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. విక్రమ్ , కార్తీ , ఐశ్వర్యారాయ్ , త్రిష , జయం రవి తదితరులు నటించిన భారీ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. గత ఏడాది పొన్నియన్ సెల్వన్ మొదటి భాగం విడుదల కాగా బ్లాక్ బస్టర్ అయ్యింది.
పొన్నియన్ సెల్వన్ మొదటి భాగానికి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. ఒకప్పుడు మణిరత్నం చిత్రాలంటే చరిత్ర …… అలాంటి సంచలన దర్శకుడు మణిరత్నం కొంతకాలంగా విజయాలు లేకుండా ప్లాప్ డైరెక్టర్ గా ముద్రపడింది. దాంతో పొన్నియన్ సెల్వన్ చిత్రంపై పెద్దగా అంచనాలు లేకపోయినప్పటికీ బ్లాక్ బస్టర్ అయ్యింది.
ఇక మొదటి భాగం భారీ విజయం సాధించడంతో రెండో భాగం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఆ అంచనాలను అందుకునేలా పొన్నియన్ సెల్వన్ 2 రూపొందినట్లు సమాచారం. 2023 ఏప్రిల్ 28 న ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కానుంది. భారీ తారాగణం , భారీ సాంకేతిక వర్గం ఈ సినిమాకు పని చేయడంతో బడ్జెట్ కూడా ఎక్కువే అయ్యింది. బిగ్ స్టార్స్ ఈ సినిమాలో నటించడంతో పాటుగా పొన్నియన్ సెల్వన్ గురించి తెలుసుకోవాలని అనుకునేవాళ్లు కూడా ఎక్కువగా ఉండటం కూడా ఈ సినిమాకు మరింత ప్లస్ కానుంది.