
ఇళయ దళపతి విజయ్ తాజాగా 67 వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. వండర్స్ క్రియేట్ చేస్తున్న సంచలన దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో స్టార్ కాస్ట్ మాములుగా లేదు. నిన్నటి రోజున వరుసగా ఈ సినిమాలో ఎవరెవరు నటించనున్నారో ప్రకటించారు ……. ఆ లిస్ట్ చూస్తే మాములుగా లేదు.
బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ఈ చిత్రంలో విలన్ గా నటించనున్నాడు. సంజయ్ దత్ బాలీవుడ్ లో ఒకప్పుడు నెంబర్ వన్ హీరో అనే విషయం తెలిసిందే. 90 వ దశకంలో పలు బ్లాక్ బస్టర్ చిత్రాలతో బాక్సాఫీస్ ను షేక్ చేసాడు. ఇక ఇటీవల KGF 2 చిత్రంలో విలన్ గా నటించాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో కాబోలు విజయ్ సినిమాలో విలన్ గా తీసుకున్నారు.
ఇక త్రిష ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించనుంది. అలాగే హీరో అర్జున్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించనున్నాడు. ఈ విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటించారు మేకర్స్. వీళ్ళతో పాటుగా పలువురు ప్రముఖులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. విజయ్ ఇటీవల వారిసు వంటి క్లాసిక్ సినిమాతోనే 270 కోట్లకు పైగా వసూళ్లను సాధించడంతో ఇక యాక్షన్ మూవీ చేస్తే బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయమని భావిస్తున్నారు.