హీరో అర్జున్ హనుమంతుడికి చెన్నైలో గుడి కట్టించాడు. సాధారణంగా హనుమంతుడి గుడి అనగానే గర్భగుడి , మంటపం , ధ్వజస్థంభం అలాగే హనుమంతుడి విగ్రహం మొత్తం ఎర్ర చందనంతో నింపేస్తారు. కానీ అందుకు విభిన్నంగా హీరో అర్జున్ కట్టించిన గుడి ఉండటం విశేషం. యోగముద్రలో ఉన్న హనుమంతుడు దర్శనం ఇస్తాడు అర్జున్ కట్టించిన గుడిలో. ఇక ఈ గుడి ఓపెన్ టెంపుల్ కావడం విశేషం. నాలుగు గోడల మధ్య హనుమంతుడు ఉండడు ఈ గుడిలో ……. ఓ బృందావనం లాంటి ఉద్యానవనంలో చూపరులను ఆకట్టుకునేలా ఉంది ఈ హనుమంతుడి గుడి.
మొత్తానికి ఈ గుడి చూసి అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనౌతున్నారు. ఆంజనేయస్వామి గుడి ఎక్కడ చూసినా ఒకేలా ఉంటుంది కానీ హీరో అర్జున్ కట్టించిన ఈ గుడి మాత్రం విభిన్నంగా ఉంది దాంతో హీరో అర్జున్ అభిరుచిని మెచ్చుకుంటున్నారు. ఈ గుడిని చూడటానికి పలువురు ప్రముఖులు ఆసక్తి చూపిస్తున్నారు.
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు , ఎమ్మెల్సీ కవిత చెన్నై పర్యటించింది తాజాగా. హీరో అర్జున్ కట్టించిన గుడిని దర్శించుకుంది. అర్జున్ అభిరుచిని గురించి తెలుసుకొని ప్రశంసించింది. అంతేకాదు ఆ గుడి తాలూకు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంకేముంది ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. అర్హున్ కట్టించిన గుడిని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అర్జున్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Visited the iconic Hanuman temple during my visit to Chennai today where I was fortunate enough to perform pooja for the almighty.
My best wishes and congratulations to @akarjunofficial for the devotion and vision. pic.twitter.com/2AWB7g28jW
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 10, 2023