హాట్ హీరోయిన్ నమిత కవల పిల్లలకు జన్మనిచ్చింది. కృష్ణాష్టమి రోజున ఈ విషయాన్ని తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది నమిత. తనకు ఇద్దరు అబ్బాయిలు కవలలుగా పుట్టారని , వాళ్ళు ఈ ప్రపంచంలోకి రావడానికి సహాయపడిన డాక్టర్లకు అలాగే వైద్య సిబ్బందికి కృతఙ్ఞతలు తెలియజేసింది నమిత. కృష్ణాష్టమి పండగ సందర్బంగా ఈ విషయాన్ని మీకు తెలియజేయడం మరింత సంతోషాన్ని ఇస్తోందని అంది నమిత.
తెలుగు , తమిళ , హిందీ , మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది నమిత. గ్లామర్ తారగా కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టింది ఈ భామ. తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. అయితే హీరోయిన్ గా కంటే ఐటెం భామగా ఎక్కువగా పేరొచ్చింది. హాట్ పాత్రలో నటించి పిచ్చెక్కించింది. హీరోయిన్ గా ఫేడౌట్ అయ్యాక అడపా దడపా గ్లామర్ పాత్రల్లో రాణించింది.
ఇక కెరీర్ అయిపోయిందని తెలుసుకున్నాక వీరేంద్ర చౌదరి అనే నటుడ్ని పెళ్లి చేసుకుంది. సంసారం జీవితం సాఫీగా సాగుతుండటంతో కవల పిల్లలకు జన్మనిచ్చింది. తమ జీవితంలోకి కవలలు రావడంతో మరింత సంతోషంగా ఉన్నారు నమిత – వీరేంద్ర చౌదరి.
Breaking News