సౌత్ లో నెంబర్ వన్ హీరోయిన్ అయిన నయనతార తాజాగా నటించిన చిత్రం తెలుగులో ” కనెక్ట్ ” అనే టైటిల్ తో వస్తోంది. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నయనతార భర్త విఘ్నేష్ శివన్ నిర్మించడం విశేషం. నయనతార ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో బాలీవుడ్ దిగ్గజం అనుపమ్ ఖేర్ నటించగా మరో కీలక పాత్రలో సత్యరాజ్ నటించాడు.
ఈ సినిమా డిసెంబర్ 22 న విడుదల కానుంది. దాంతో ఈరోజు కనెక్ట్ ట్రైలర్ విడుదల చేసారు. హర్రర్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందినట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. నయనతార కూతురు లో దెయ్యం ఆవహించడం , ఆ దెయ్యం లీలలతో ట్రైలర్ సాగింది. మొత్తానికి హర్రర్ చిత్రాలను కోరుకునే వాళ్లకు ఇది మంచి ఛాయిస్ కావచ్చు.
డిసెంబర్ 22 న విడుదల కానుంది కనెక్ట్ చిత్రం. ఇక ఈ చిత్రాన్ని ఎవరు విడుదల చేస్తున్నారో తెలుసా …….. డార్లింగ్ ప్రభాస్ విడుదల చేస్తున్నాడు. యువి క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రం విడుదల కానుంది. ప్రభాస్ నయనతార కు శుభాకాంక్షలు చెబుతూ ట్రైలర్ ను విడుదల చేయడం విశేషం. నయనతార – ప్రభాస్ ఇద్దరూ కలిసి యోగి చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.