
దక్షిణ భారతంలో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరయ్యా అంటే టక్కున చెప్పే పేరు నయనతార. మలయాళ ముద్దుగుమ్మ అయిన నయనతార తమిళనాట స్థిరపడింది. ఎక్కువగా తమిళ చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ తమిళంతో పాటుగా తెలుగు , మలయాళ చిత్రాల్లో కూడా నటించింది. ఇక తాజాగా హిందీలో కూడా అడుగుపెట్టింది.
ఇక ఈ భామ ఇప్పటి వరకు 75 సినిమాల్లో నటించిన ఈ భామ భారీగా ఆస్తులు కూడబెట్టింది. హైదరాబాద్ లో రెండు అధునాతనమైన బంగ్లాలు సొంతం చేసుకుంది. అంతేకాదు తమిళనాట నాలుగు ఖరీదైన బంగ్లాలు కొన్నది. అలాగే విలాసవంతమైన ఆఫీస్ కూడా ఉంది. ఇక కేరళలో కూడా అధునాతనమైన రెండు ఇండ్లు ఉన్నాయట. ఫామ్ హౌజ్ కూడా. వీటి మొత్తం విలువ 165 కోట్లు అని తెలుస్తోంది.
నయనతార ఆస్తుల విలువ 165 కోట్లు అంటే ఈ విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమా ! మార్కెట్ రేటు కాదు. మార్కెట్ రేటు ప్రకారం సుమారుగా 1000 కోట్ల పై మాటే అని తెలుస్తోంది. ప్రభుత్వానికి చూపించే లెక్కలు వేరు …….. మార్కెట్ విలువ వేరుగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఒక్కో సినిమాకు 10 కోట్ల మేర రెమ్యునరేషన్ అందుకుంటోంది నయనతార.