తన భర్తకు జరిగిన అన్యాయానికి రగిలిపోయింది స్టార్ హీరోయిన్ నయనతార . దాంతో స్టార్ హీరో అజిత్ తన భర్తకు హ్యాండ్ ఇవ్వడంతో అతడి స్థానంలో విజయ్ సేతుపతి ని హీరోగా పెట్టి ఆ సినిమా చేయడానికి భారీగా స్కెచ్ వేసింది నయనతార. ఆవరసరమైతే తన సొంత నిర్మాణ సంస్థ పైన ఈ సినిమా తీయాలని డిసైడ్ అయ్యిందట.
అసలు విషయం ఏంటంటే ……. నయనతార భర్త విఘ్నేష్ శివన్ హీరో అజిత్ కు ఓ కథ చెప్పాడు. అది నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అజిత్. ఇక ఈ కాంబినేషన్ లో సినిమా నిర్మించడానికి భారీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ముందుకు వచ్చింది. అంతా సిద్ధమైంది ….. ఇక సెట్స్ మీదకు వెళ్లడమే తరువాయి అనుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా హీరో అజిత్ నయనతార భర్త విఘ్నేష్ శివన్ కు హ్యాండ్ ఇచ్చాడు.
ఈ విషయం నయనతారకు తెలియడంతో జోక్యం చేసుకొని సర్దుబాటు చేయడానికి గట్టి ప్రయత్నాలే చేసింది. అజిత్ తో మాట్లాడింది. అంతా సెట్ అవుతుందిలే అనుకుంటే తన మాటను కూడా లెక్కచేయలేదు హీరో అజిత్. దాంతో నయనతార కోపంతో రగిలిపోయింది. అంతే ……. విజయ్ సేతుపతితో మాట్లాడి అజిత్ రిజెక్ట్ చేసిన సినిమాను పట్టాలెక్కించడానికి స్కెచ్ వేసింది. నయనతార అంటే అభిమానం ఉన్న విజయ్ సేతుపతి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. నయనతార కోసం కుష్భు భర్త సుందర్ కు హ్యాండ్ ఇచ్చాడట విజయ్ సేతుపతి.