సౌత్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న నయనతార తాజాగా బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టింది. అయితే నయనతార త్వరలోనే నటనకు గుడ్ బై చెప్పనున్నట్లు ఊహాగానాలు చెలరేగడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. నయనతార నటనకు గుడ్ బై చెప్పడం ఏంటి ? సినిమాలను వదిలేసి వ్యాపారరంగంలోకి వెళ్లడం ఏంటి ? అని కంగారు పడుతున్నారు.
ఇలా ఊహాగానాలు చెలరేగడానికి కారణం ఏంటో తెలుసా ……….. నయనతార తన సంపాదనని ఇతర రంగాల్లో పెట్టుబడులుగా పెట్టడమే ! నయనతార దక్షిణ భారతదేశంలోనే అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్ అనే విషయం తెలిసిందే. దాంతో అలా వచ్చిన భారీ మొత్తాన్ని రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులుగా పెడుతోంది. అంతేకాదు ఇతర వ్యాపారాలలో భాగస్వామిగా కూడా చేరుతోంది.
దాంతో ఇక సినిమాలకు గుడ్ బై చెప్పనుంది అనే వార్తలు చెలరేగాయి. అయితే వీటిపై నయనతార లేదా ఆమె భర్త విఘ్నేష్ శివన్ మాత్రమే స్పందించాల్సి ఉంది. నయనతార గత 20 ఏళ్లుగా హీరోయిన్ గా నటిస్తోంది. నటన పట్ల బోర్ కొడితే కొంతకాలం విరామం ఇచ్చినా ఇవ్వొచ్చు. కానీ ప్రస్తుతం అయితే పలు సినిమాలను అంగీకరించింది కాబట్టి ఇప్పట్లో నటనకు గుడ్ బై చెప్పకపోవచ్చని తెలుస్తోంది.
Breaking News