
స్టార్ హీరోయిన్ నయనతార తల్లి కావాలని ఆరాటపడుతోందట. ఎందుకంటే నయనతార వయసు ఇప్పుడు 38 సంవత్సరాలు దాటింది. దాంతో 40 తర్వాత తల్లి కావడం అంటే కొంచెం కష్టం కూడా. అందుకే ఇప్పుడు తల్లి కావాలని , ఓ బిడ్డకైనా జన్మనివ్వాలని ఆశిస్తోందట. ప్రస్తుతం ఆ దిశగా ఆలోచనలు చేస్తోందట నయనతార.
ఒకవేళ ఇదే కనుక నిజమైతే నయనతార తో సినిమాలు చేస్తున్న దర్శక నిర్మాతలకు ఇది పెద్ద షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. తల్లి కావాలని అనుకుంటే అది తప్పకుండ సినిమాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సరోగసీ ద్వారా తల్లి అయ్యిందనుకో పెద్దగా నష్టం ఉండదు కానీ తానే గర్భం దాల్చాలని భావిస్తే మాత్రం తప్పకుండ దర్శక నిర్మాతలతో పాటుగా హీరోలకు కూడా నష్టమే !
ప్రస్తుతం నయనతార – విఘ్నేష్ శివన్ లు ఇదే ప్లాన్ చేస్తున్నారట. తమిళ హీరో శింబుతో జోరుగా ప్రేమాయణం సాగించిన ఈ భామ అతడిచ్చిన షాక్ నుండి కోలుకోవడానికి చాలా సమయమే పట్టింది. ఆ తర్వాత ప్రభుదేవాతో పెళ్లి అనుకుంది ….. ఎన్నో గొడవలు అయ్యాయి కానీ ఆ పెళ్లి కూడా పెటాకులే అయ్యింది. ఇక అప్పుడు దర్శకుడు విఘ్నేష్ పరిచయం కావడం …… ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఆరేళ్ళ సహజీవనం తర్వాత పెళ్లి చేసుకున్నారు.